నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం నెల్లికల్లులో ఐదు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. హాలియాలో జరిగే బహిరంగసభలోనూ ప్రసంగించనున్నారు. ఇక్కడి నుంచే ఆయన సాగర్ ఉప ఎన్నిక శంఖారావాన్ని పూరిస్తారని భావిస్తున్నారు. అభ్యర్థి పేరును కూడా ఇదే […]

Update: 2021-02-09 20:36 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం నెల్లికల్లులో ఐదు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. హాలియాలో జరిగే బహిరంగసభలోనూ ప్రసంగించనున్నారు. ఇక్కడి నుంచే ఆయన సాగర్ ఉప ఎన్నిక శంఖారావాన్ని పూరిస్తారని భావిస్తున్నారు. అభ్యర్థి పేరును కూడా ఇదే వేదిక మీద నుంచి ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పర్యటన ఇలా

ఉదయం

11.35 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరుతారు
11.40 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
11.40 బేగంపేట ఎయిర్ పోర్టునుంచి హెలీక్యాప్టర్లో బయలుదేరుతారు

మధ్యహ్నం

12.30 నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నందికొండకు చేరుకుంటారు.
12.40 గంటలకు రోడ్డు మార్గాన తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామానికి వెళ్తారు.
12.40 గంటలకు నీటిపారుదల పథకాన్ని ప్రారంభిస్తారు.
01.00 గంటలకు నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీకి చేరుకుని భోజనం చేస్తారు.
3.10 గంటలకు హాలియా మండలం పాలెం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సాయంత్రం

4.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరుగు పయనమవుతారు.
4.55 గంటలకు బేగంపేటకు, ప్రగతి భవన్ కు చేరుకుంటారు.

Tags:    

Similar News