మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు..

దిశ, జడ్చర్ల : టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా మాజీ మంత్రి, జ‌డ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ద‌ళిత బంధుపై ప్రస్తావించ‌గా కేసీఆర్ స్పందించారు. ద‌ళితబంధు కేవ‌లం రూ.10 ల‌క్షలిచ్చి మ‌మ అనిపించే కార్యక్రమం కాదన్నారు. ద‌ళితుల అభ్యున్నతికి అనేక ప్రయ‌త్నాలు జ‌రిగాయన్నారు. మాజీ మంత్రి, జ‌డ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి స‌ర్పంచ్‌గా ప‌ని చేసిన కాలంలో సొంత గ్రామంలో 10 ఎక‌రాల భూమిని […]

Update: 2021-10-25 11:51 GMT

దిశ, జడ్చర్ల : టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా మాజీ మంత్రి, జ‌డ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ద‌ళిత బంధుపై ప్రస్తావించ‌గా కేసీఆర్ స్పందించారు. ద‌ళితబంధు కేవ‌లం రూ.10 ల‌క్షలిచ్చి మ‌మ అనిపించే కార్యక్రమం కాదన్నారు. ద‌ళితుల అభ్యున్నతికి అనేక ప్రయ‌త్నాలు జ‌రిగాయన్నారు. మాజీ మంత్రి, జ‌డ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి స‌ర్పంచ్‌గా ప‌ని చేసిన కాలంలో సొంత గ్రామంలో 10 ఎక‌రాల భూమిని (ఇప్పుడు రూ. 50 ల‌క్షల విలువ) ఆరుగురు ద‌ళితుల‌కు పంచి పెట్టారని గుర్తుచేశారు.

అలా అనేక మంది ప్రయ‌త్నాలు చేశారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కార్యక్రమాలను అమ‌లు చేశాయన్నారు. కానీ అనుకున్న ఫ‌లితాలు రాలేదు. ఆశ‌లు నెర‌వేర‌లేదు. అందువ‌ల్ల వారు స‌ఫ‌ర్ అవుతున్నాయి. అవ‌న్నీ ఓవ‌ర్ క‌మ్ కావ‌డానికి రూ.10 ల‌క్షలు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే వివిధ రంగాలైన మెడిక‌ల్, వైన్స్, ఫ‌ర్టిలైజ‌ర్స్ షాపుల‌తో మొద‌లైన వాటిలో ఎస్సీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెడుతున్నాం. ర‌క్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News