గాలి ద్వారా కరోనా సోకదు

కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ICMR (ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఫర్ రీసెర్ఛ్ సెంటర్) ఖండించింది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యక్తులకు వ్యాప్తి చెందదని, కేవలం నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే సోకుతుందని స్ఫష్టం చేసింది. ఇదివరకు నమోదైన కేసుల్లో గాలి ద్వారా కరోనా వచ్చినట్టు ఆధారాలు లేవని వెల్లడించింది. అటు దేశ వ్యాప్తంగా 13.6లక్షల మంది వలసదారులకు కేంద్రం రిలీఫ్ క్యాంపుల ద్వారా ఆహారం, మెడికల్ […]

Update: 2020-04-05 06:45 GMT

కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ICMR (ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఫర్ రీసెర్ఛ్ సెంటర్) ఖండించింది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యక్తులకు వ్యాప్తి చెందదని, కేవలం నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే సోకుతుందని స్ఫష్టం చేసింది. ఇదివరకు నమోదైన కేసుల్లో గాలి ద్వారా కరోనా వచ్చినట్టు ఆధారాలు లేవని వెల్లడించింది. అటు దేశ వ్యాప్తంగా 13.6లక్షల మంది వలసదారులకు కేంద్రం రిలీఫ్ క్యాంపుల ద్వారా ఆహారం, మెడికల్ సేవలు అందజేస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలను భయాందోళనకు గురించేసేలా ఎవరైనా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హోంశాఖ హెచ్చరించింది.

Tags: carona, lockdown, icmr, virus doesnt attack on air, condemn

Tags:    

Similar News