మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. పింఛన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్ల లబ్ధిదారులు.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి పెన్షన్ అవకాశం కల్పించామో […]

Update: 2021-09-16 06:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. పింఛన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్ల లబ్ధిదారులు.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి పెన్షన్ అవకాశం కల్పించామో స్పష్టమైన వివరాలను బయటపెట్టాలని సీఎం జగన్ సూచించారు. పెన్షనర్ల జాబితాపై ప్రజలకు మరింత స్పష్టతనివ్వాలని సూచించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డులతోపాటు పలు పథకాలపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, కుట్రలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News