కరువు సీమలో జలకళ..

దిశ, వెబ్‌డెస్క్ : కరువు సీమలో జలకళను తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండలో ఈ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టనున్నారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణం వలన ఏడు […]

Update: 2020-12-09 02:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరువు సీమలో జలకళను తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు.

ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండలో ఈ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టనున్నారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణం వలన ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు మేలు చేకూరనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News