అసెంబ్లీలో రైతుల తరపున పోరాడుతాం : భట్టి

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జంపన్న వాగు ఉధృతి పెరిగి, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన పంటకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2020-08-26 10:57 GMT

Tags:    

Similar News