అన్ని సరిహద్దులను మూసివేయండి
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ నివారించేందుకు కేంద్రం మరో అడుగు వేసింది. లాక్‌డౌన్ ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో ప్రజల కదలికలపై కేంద్రం సీరియస్ అయింది. లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోని ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు, హెచ్చరికలు చేసింది. అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దులను కచ్చితంగా మూసివేయాలని తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ ఉల్లంఘనలకు ఆయా జిల్లాల డీఎం లేదా ఎస్పీలు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రజలెవరూ జిల్లాల, రాష్ట్రాల సరిహద్దులు […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ నివారించేందుకు కేంద్రం మరో అడుగు వేసింది. లాక్‌డౌన్ ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో ప్రజల కదలికలపై కేంద్రం సీరియస్ అయింది. లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోని ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు, హెచ్చరికలు చేసింది. అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దులను కచ్చితంగా మూసివేయాలని తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ ఉల్లంఘనలకు ఆయా జిల్లాల డీఎం లేదా ఎస్పీలు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రజలెవరూ జిల్లాల, రాష్ట్రాల సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వలస కూలీలు, కార్మికులను ఆహారం, వసతి కల్పించేందుకు వారున్న రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని.. అందుకు అవసరమైన ఖర్చును ఎస్‌డీఆర్ఎఫ్ నిధుల నుంచి వినియోగించుకోవాలని, అన్ని రాష్ట్రాలకు పుష్కలంగా నిధులు ఉన్నాయని కేంద్రం స్ఫష్టం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారందరినీ 14 రోజుల క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాలని సూచనల్లో వెల్లడించింది.
Tags: lockdown, Central government, orders, Close, Borders