రావణ దహనంలో రచ్చ.. కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రావణ దహనంలో రచ్చ జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని నిర్వాహకులు జమ్మి వద్ద రావణ దహనం చేసే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న పోతంగల్ గ్రామానికి చెందిన వారు, వివిధ గ్రామాలకు చెందిన కొందరు రావణుడు మా దేవుడని దహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ చిలికిచిలికి పెద్దదిగా కావడంతో కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ […]

Update: 2021-10-15 22:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రావణ దహనంలో రచ్చ జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని నిర్వాహకులు జమ్మి వద్ద రావణ దహనం చేసే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న పోతంగల్ గ్రామానికి చెందిన వారు, వివిధ గ్రామాలకు చెందిన కొందరు రావణుడు మా దేవుడని దహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ చిలికిచిలికి పెద్దదిగా కావడంతో కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శంకర్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను పిలిపించి సముదాయించి పంపించారు. చివరకు రావణ దహనం నిలిచిపోయింది.

Tags:    

Similar News