నడి రోడ్డుపై మద్యం సేవిస్తున్న పోలీసులు.. స్థానికులు ఏం చేశారంటే?
దిశ,కోదాడ: నడిరోడ్డుపై పోలీసు కానిస్టేబుళ్లు మద్యం సేవించారంటూ స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటన సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మద్యం దుకాణం పక్కన ఉన్న రోడ్డుపై కారు ఆపి సెలవులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం సేవిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నడి రోడ్డుపై మద్యం సేవించడం ఏమిటని, స్థానికులు ప్రశ్నిస్తే తాము పోలీసు కానిస్టేబుళ్ళ మని బెదిరించారని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులకు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై […]
దిశ,కోదాడ: నడిరోడ్డుపై పోలీసు కానిస్టేబుళ్లు మద్యం సేవించారంటూ స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటన సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మద్యం దుకాణం పక్కన ఉన్న రోడ్డుపై కారు ఆపి సెలవులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం సేవిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నడి రోడ్డుపై మద్యం సేవించడం ఏమిటని, స్థానికులు ప్రశ్నిస్తే తాము పోలీసు కానిస్టేబుళ్ళ మని బెదిరించారని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులకు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో పోలీసు కానిస్టేబుళ్లకు స్వల్పగాయలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ సర్దుమనిగింది. కానీ, ఘటనా స్థలానికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ క్రాంతికుమార్ సైతం పోలీసు కానిస్టేబుళ్లకు వత్తాసు పలుకుతూన్నారని, కోదాడ పట్టణ పోలీసులపై స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ప్రైవేట్ డాక్టర్, పట్టణ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.