రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి ఉత్తర్వులు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కమీషన్లను రేషన్ డీలర్లు విడుదల చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 17 వేల రేషన్ దుకాణాలు ఉండగా 2015 అక్టోబర్ ఒకటి నుంచి 2018 ఆగస్టు 31 వరకూ మొత్తం రూ. 56.77 కోట్లు కమీషన్ రూపంలో డీలర్లు రావాల్సి ఉంది. మొదటి విడతలో రూ.28.38 కోట్లను ఇప్పటికే డీలర్లకు అందజేశారు. రెండో విడతగా […]

Update: 2021-06-10 10:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కమీషన్లను రేషన్ డీలర్లు విడుదల చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 17 వేల రేషన్ దుకాణాలు ఉండగా 2015 అక్టోబర్ ఒకటి నుంచి 2018 ఆగస్టు 31 వరకూ మొత్తం రూ. 56.77 కోట్లు కమీషన్ రూపంలో డీలర్లు రావాల్సి ఉంది. మొదటి విడతలో రూ.28.38 కోట్లను ఇప్పటికే డీలర్లకు అందజేశారు. రెండో విడతగా మరో రూ.28. 38 కోట్లను విడుదల చేసేందుకు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు.

కమీషన్లతో పాటు ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించాలని కూడా కమిషనర్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 1,400 రేషన్ డీలర్లను కొత్తగా తీసుకోనున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 41 రేషన్ దుకాణాలకు డీలర్లు లేరు. వయసు నిబంధనల కారణంగా ఏర్పడిన ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా ఉన్నాయి. వీటితో పాటు రాజీనామా, మరణించిన డీలర్ల స్థానాల్లోనూ కొత్తవారిని నియమించుకునేందుకు జిల్లా కలెక్టర్లకు, చీఫ్ రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News