పెళ్లి జరిగి ఏడాది కాకముందే అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న వరుణ్ తేజ్.. కారణం అదేనా?

మెగా ఫ్యామిలికీ ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా ఇండస్ట్రీలో ఈ కుటుంబానికి చెందిన హీరోలే ఉన్నారు.

Update: 2024-05-27 02:09 GMT

దిశ, సినిమా: మెగా ఫ్యామిలికీ ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా ఇండస్ట్రీలో ఈ కుటుంబానికి చెందిన హీరోలే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోల మీదే కాకుండా కోడళ్లు, కూతుర్లపై పలు ట్రోల్స్ వస్తున్నాయి. కానీ వాటిని ఫ్యాన్స్ కొట్టిపారేస్తూ వారికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మెగా హీరో వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేక పోయాడు. ఇక లావణ్య విషయానికొస్తే.. పెళ్లి తర్వాత ఓ వెబ్ సిరీస్ తప్ప మరో కొత్త సినిమా ప్రకటించలేదు.

ప్రస్తుతం వీరిద్దరూ వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే అంతా బాగానే ఉందనుకునే నేపథ్యంలో.. వరుణ్ ఓ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడంటూ సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయం కావడంతో అది కాస్త పెరిగి పెద్దగా అయిందట ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారట. దీంతో మెగా ఫ్యామిలీ వరుణ్ హెల్త్ కోసం చేయించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన కొందరు గుడ్ న్యూస్ చెబుతారనుకుంటే.. పెళ్లై ఏడాది కాకముందే అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే ఇంకొందరు మాత్రం అయ్యో ఎంత కష్టం వచ్చిందే అని అంటున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇందులో నిజం ఎంత ఉందో తెలియకుండా ఏదేదో అనుకోవడమేనా? అని గట్టిగా ఇలాంటి వార్తలను ఖండిస్తున్నారు.

Similar News