మెగా డాటర్స్ శ్రీజ-నిహారిక విడాకులకు కారణం ఆమెనా.. ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలన విషయం!

మెగా డాటర్స్ శ్రీజ, నిహారికల గురించి నిత్యం పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-27 04:20 GMT

దిశ, సినిమా: మెగా డాటర్స్ శ్రీజ, నిహారికల గురించి నిత్యం పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్రీజ ఇండస్ట్రీలో లేనప్పటికీ ఆమె పర్సనల్ విషయాలు నెట్టింట మార్మోగిపోతున్నాయి. అలాగే నాగబాబు కూతురు నిహారిక ఎక్కువ సినిమాలు చేయనప్పటికీ ఆమె ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా గుర్తింపు వచ్చింది. అయితే గత కొద్ది కాలంగా శ్రీజ, నిహారికకు సంబంధించిన పుకార్లు ఎక్కువగా వస్తున్నాయి. దానికి కారణం వీరు పెళ్లి చేసుకుని భర్తలతో విడిపోవడమే. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. అలాగే ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం ఓ బిజినెస్ స్టార్ట్ చేసి తన ఇద్దరు పిల్లలతో ఉంటుంది. ఇక నిహారిక విషయానికొస్తే.. ఆమె చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. కానీ సంవత్సరం కాకముందే విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటినుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం మెగా ఫ్యామిలీకి చెందిన లేడీ అని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని బాగా చెప్పేదట. దీంతో వీరు బ్యూటీ పార్లర్‌కు పంపించకపోయిన అడిగింది కొనివ్వకపోయినా మహిళ స్వేచ్ఛను తొక్కేస్తున్నట్లే అని భావించి విడాకులు తీసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె అలా చెప్పడం వల్లే శ్రీజ, నిహారిక అలా అనుకున్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Similar News