సుడిగాలి సుధీర్ ప్రేమలో హాట్ బ్యూటీ.. అలా పిలిచి అసలు మ్యాటర్ రివీల్ చేయడంతో అంతా షాక్‌?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అందరికీ సుపరిచితమే. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Update: 2024-05-24 12:55 GMT

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అందరికీ సుపరిచితమే. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రష్మితో ఎన్నో స్పెషల్ షోలు చేయడంతో అంతా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. ఈ క్రమంలోనే వారు స్టేజిపై పెళ్లి కూడా చేసుకోవడంతో నిజ జీవితంలో కూడా భార్యభర్తలు అవుతారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అదంగా జనాలను ఎంటర్‌టైన్ చేయడానికి చేసినట్లు ఎన్నోసార్లు రష్మి చెప్పినప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా వీరిద్దరు 10 సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగిస్తున్నారంటూ ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే సుధీర్ ఇవన్నీ పట్టించుకోకుండా.. పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల సుధీర్ పూర్తిగా బుల్లితెర దూరమయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఓ రెండు షోలకు హోస్ట్‌గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, హాట్ బ్యూటీ అషు రెడ్డి సుధీర్ ప్రేమలో పడినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దానికి కారణం ఓ షోలో ఆమె బావ అని పిలవడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ జోరందుకున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షోకు గెస్టులుగా, యాంకర్ స్రవంతి, అషు రెడ్డి, భాను పలువురు సిరీయల్ నటీనటులు వచ్చారు. అయితే ఇందులో అషు సుధీర్‌ను బావ అని పిలిచి ఈ షోకు వ్యూస్‌ను పెంచింది. స్టేజిపై ఎంట్రీ డాన్స్ అయిన తర్వాత యాంకర్ స్రవంతి, సీరియల్ నటి ఇద్దరికి సుధీర్ బావ జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అంతా షాక్ అవుతారు. ఇక స్రవంతి మీ బావలో అంత మ్యాటర్ ఉందా? అని అనడంతో సుధీర్ షాక్ అయి అలాగే చూస్తుండగా.. అక్కడున్న వారంతా నవ్వుతారు.

ముఖ్యంగా ఇందులో సుధీర్‌ను అషు రెడ్డి బావ అని పిలవడంతో అతన్ని ప్రేమిస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఇండైరెక్ట్‌గా బావ అని పిలిచి కన్ఫర్మ్ చేసిందని నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే అదంతా షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేందుకే ఇలా చేసిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షోకు సంబంధించిన ప్రోమో వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

Read More..

గుడ్ న్యూస్.. శర్వానంద్-కృతిశెట్టి ‘మనమే’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)

Tags:    

Similar News