తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎట్టకేలకు సీక్రెట్ రివీల్!

ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు, హీరోలు పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టేస్తున్నారు.

Update: 2024-04-30 08:53 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు, హీరోలు పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టేస్తున్నారు. దీంతో కాస్త సినిమాలకు దూరమై పెళ్లి పిల్లలంటూ.. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కొందరు హీరోయిన్లు తాము తల్లి కాబోతున్న ప్రకటించి ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. ఇటీవల దీపికా పదుకొణె తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విషయాన్ని ప్రకటించకుండా సీక్రెట్‌గా ఉంచిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఇటీవల ఆమె ఓ స్టార్ సెలబ్రిటీ ఇచ్చిన పార్టీకి హాజరు కాలేదట. తన బేబీ బంప్ ఎక్కడ బయటపడుతుందో అని క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ పార్టీకి మాత్రం రానట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయంపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో అది తెలిసిన వారంతా కత్రినా తల్లి కాబోతుందా? అని కంగ్రాట్స్ చెబుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News