Pawan Kalyan ముఖంపై కార్ కీస్ విసిరేసిన Amitha Bachchan.. దేనికో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2023-09-15 10:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఆయనను ప్రేక్షకులు అభిమానిస్తారు అనడం కంటే పిచ్చిగా ప్రేమిస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే కామన్ పీపుల్స్ మాత్రమే కాకుండా ఆయనను స్టార్ హీరోలు కూడా ఇష్టపడుతుంటారు.

తాజాగా, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ముఖం మీద బాలీవుడ్ హీరో కార్ కీస్ విసిరి కొట్టాడట. అయితే ఇది నిజ జీవితంలో కాదు. అమితా బచ్చన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమాను ఓసారి తన ఇంట్లో మినీ థియేటర్ లో తన భార్యతో కలిసి చూసారట. అమితాబచ్చన్ దంపతులు ఇద్దరు మొదటి నుంచి ఎంతో ఎంజాయ్ చేస్తూ చూశారట. సడన్‌గా క్లైమాక్స్ సీన్ లో హీరోను హీరోయిన్ వదిలి వెళ్ళిపోతుంటే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీద ఉన్న లవ్ ను ఎక్స్‌ప్రెస్ చేయకుండా.. తనలోనే తానే దాచుకొని సెండాఫ్ ఇస్తాడు. అలా హీరోయిన్ బాయ్ చెప్పి వెళ్ళిపోగానే ఏం సినిమా రా ఇది ఎవడ్రా బాబు ఈ సినిమా తీసింది అని కోపంతో అమితాబచ్చన్ స్క్రీన్ మీద పవన్ వచ్చినప్పుడు ముఖంపై కార్ కీస్ విసిరి కొట్టాడట. కానీ ఆ తర్వాత సడన్‌గా హీరోయిన్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పవన్ కళ్యాణ్ నుదుటి మీద కిస్ పెట్టి ఐ లవ్ యు చెప్పగానే అమితాబచ్చన్, జయ బచ్చన్ ఇద్దరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారట.

ఇవి కూడా చదవండి : అర‌బ్ కంట్రీ ఓమ‌న్‌లో బైక్ రైడింగ్ చేస్తున్న స్టార్ హీరో.. వీడియో వైరల్

Tags:    

Similar News