బ‌య‌టప‌డిన సీఐ సూసైడ్ లెట‌ర్‌

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల సీఐ ర‌మ‌ణ బుధ‌వారం సాయంత్రం హ‌న్మ‌కొండ‌లో పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ప్రాణాపాయ‌మేమీ లేద‌ని వైద్యులు వెల్ల‌డించారు. సీఐ ఆత్మ‌హ‌త్యాయ‌త్నంతో పోలీస్‌శాఖ‌లో తీవ్ర క‌ల‌క‌ల‌మే చెల‌రేగింది. పోలీసు శాఖ‌ప‌ర‌మైన వేధింపులే కార‌ణ‌మై ఉంటాయ‌ని ముందు అనుమానాలు వ్య‌క్తం కాగా, ఇంట్లో దొరికిన లెట‌ర్‌తో కుటుంబ వ్య‌వ‌హార‌మే ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి దారితీసింద‌ని తేలిపోయింది. త‌న చావుకు […]

Update: 2021-02-10 22:51 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల సీఐ ర‌మ‌ణ బుధ‌వారం సాయంత్రం హ‌న్మ‌కొండ‌లో పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ప్రాణాపాయ‌మేమీ లేద‌ని వైద్యులు వెల్ల‌డించారు. సీఐ ఆత్మ‌హ‌త్యాయ‌త్నంతో పోలీస్‌శాఖ‌లో తీవ్ర క‌ల‌క‌ల‌మే చెల‌రేగింది.

పోలీసు శాఖ‌ప‌ర‌మైన వేధింపులే కార‌ణ‌మై ఉంటాయ‌ని ముందు అనుమానాలు వ్య‌క్తం కాగా, ఇంట్లో దొరికిన లెట‌ర్‌తో కుటుంబ వ్య‌వ‌హార‌మే ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి దారితీసింద‌ని తేలిపోయింది. త‌న చావుకు కుటుంబ‌, ఆర్థిక అంశాలే కార‌ణ‌మంటూ స్ప‌ష్టంగా పేర్కొన్నారు. భార్య స్వాతికి నీకు అన్యాయం చేయాల‌ని ఎన్న‌డు అనుకోలేదంటూ ఆవేద‌న‌తో తెలిపారు.

Tags:    

Similar News