కలెక్టర్‌ను అని చెప్పినా.. వినలేదు

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల విజిలెన్సు అధికారులు జిల్లా కలెక్టర్​ను తీవ్రంగా అవమానించారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాను ఆలయంలోకి అనుమతించలేదు. కోవింద్ శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి ముందుగానే బయోమెట్రిక్ ఎంట్రీ దగ్గరకు కలెక్టర్ భరత్ గుప్తా చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ కలెక్టర్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి అయిన తననే అడ్డుకోవడంతో కలెక్టర్ విస్తు […]

Update: 2020-11-24 10:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల విజిలెన్సు అధికారులు జిల్లా కలెక్టర్​ను తీవ్రంగా అవమానించారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాను ఆలయంలోకి అనుమతించలేదు. కోవింద్ శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి ముందుగానే బయోమెట్రిక్ ఎంట్రీ దగ్గరకు కలెక్టర్ భరత్ గుప్తా చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ కలెక్టర్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి అయిన తననే అడ్డుకోవడంతో కలెక్టర్ విస్తు పోయారు. తాను జిల్లా కలెక్టర్‌ను అని చెప్పినా విజిలెన్స్ అధికారులు వినలేదు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News