చిట్టీల పేరుతో రూ.3.5కోట్లు స్వాహా..

దిశ, వెబ్‌డెస్క్ :  ఏపీలోని కడప జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో అమాయకులను నట్టేటా ముంచారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ. 3.5 కోట్ల ప్రజల సొమ్ముకు కుచ్చుటోపి పెట్టారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నారు. వివరాల్లోకివెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం మందరానికి చెందిన రజినీ కాంత్ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుండేవాడు.ఈ క్రమంలోనే చిట్టీల పేరుతో వసూలు […]

Update: 2020-10-15 01:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కడప జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో అమాయకులను నట్టేటా ముంచారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ. 3.5 కోట్ల ప్రజల సొమ్ముకు కుచ్చుటోపి పెట్టారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నారు.

వివరాల్లోకివెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం మందరానికి చెందిన రజినీ కాంత్ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుండేవాడు.ఈ క్రమంలోనే చిట్టీల పేరుతో వసూలు చేసిన డబ్బులు రూ.3.5 కోట్లతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Tags:    

Similar News