సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

భారత్‌లో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు పరిధిలో జరిగే ఎగ్జామ్స్‌ను ఈ నెల31వరకు వాయిదా వేసింది. దీంతో పది, పన్నెండో తరగతి పరీక్షలు ఆగిపోయాయి. ఈ విషయంలో విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి అందరికి సమాచారం అందించాలని కోరారు. తదుపరి షెడ్యూల్‌ను మార్చి31తర్వాత ప్రకటిస్తారని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. అయితే కరోనాను దృష్టిలో పెట్టుకుని దేశంలో జరుగుతున్న సీబీఎస్ఈ, నాన్ సీబీఎస్ఈ పరీక్షలను […]

Update: 2020-03-18 19:33 GMT

భారత్‌లో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు పరిధిలో జరిగే ఎగ్జామ్స్‌ను ఈ నెల31వరకు వాయిదా వేసింది. దీంతో పది, పన్నెండో తరగతి పరీక్షలు ఆగిపోయాయి. ఈ విషయంలో విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి అందరికి సమాచారం అందించాలని కోరారు. తదుపరి షెడ్యూల్‌ను మార్చి31తర్వాత ప్రకటిస్తారని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. అయితే కరోనాను దృష్టిలో పెట్టుకుని దేశంలో జరుగుతున్న సీబీఎస్ఈ, నాన్ సీబీఎస్ఈ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, దీనిపై ఆయా రాష్ట్రాలు స్పందించాల్సి ఉండగా, నేడు తెలంగాణలో జరుగుతున్న పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags: corona, cbse, non cbse exam postponed, central govt orders, ts 10th exams

Tags:    

Similar News