మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 2లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రతీ ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆస్పతుల్లో బెడ్స్ సరిపోవడం లేదంటే కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే […]

Update: 2021-04-16 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 2లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రతీ ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆస్పతుల్లో బెడ్స్ సరిపోవడం లేదంటే కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News