వరద నష్టానికి సహాయం అందించేందుకు సిద్ధం

దిశ, ముషీరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో సంభవించిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ముంపునకు గురైన ఇళ్ల ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‎లో పర్యటిస్తున్న కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రతి చోటా తిరిగి వరద నష్టాన్ని అంచనావేసి నివేదికను తయారు […]

Update: 2020-10-23 04:10 GMT

దిశ, ముషీరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో సంభవించిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ముంపునకు గురైన ఇళ్ల ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‎లో పర్యటిస్తున్న కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రతి చోటా తిరిగి వరద నష్టాన్ని అంచనావేసి నివేదికను తయారు చేస్తుందన్నారు. కేంద్రానికి నివేదిక అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి వరద నష్టాన్ని మంజూరు చేస్తోందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‎మెంట్‎లో ఉన్న 75 శాతం కేంద్రం నిధులను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సర్కిల్ 15 డీఎంసీ ఉమా ప్రకాష్, తహశీల్దార్ జానకి, తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News