స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరో కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‍ప్లాంట్‍పై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. వందశాతం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందని అందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. స్టీల్‍ప్లాంట్‍తో పాటు అనుబంధ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు […]

Update: 2021-03-15 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‍ప్లాంట్‍పై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. వందశాతం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందని అందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. స్టీల్‍ప్లాంట్‍తో పాటు అనుబంధ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేస్తున్నాయి. ఆందోళనలకు అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తోంది.

Tags:    

Similar News