సీబీఎస్ఈ సిలబస్‌ 30శాతం కుదింపు

దిశ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌లో 30శాతం కుదించనున్నారు. అధ్యయనమే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలే పాఠ్యాంశ ప్రణాళికలో ఉండేలా హేతుబద్ధీకరిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ మేరకు 9వ, 10వ, 11వ, 12వ తరగతి విద్యార్థులకు సిలబస్ తగ్గించాలని నిర్ణయించినట్టు, ఆ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)కు సూచించినట్టు ఆయన […]

Update: 2020-07-07 07:14 GMT

దిశ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌లో 30శాతం కుదించనున్నారు. అధ్యయనమే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలే పాఠ్యాంశ ప్రణాళికలో ఉండేలా హేతుబద్ధీకరిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ మేరకు 9వ, 10వ, 11వ, 12వ తరగతి విద్యార్థులకు సిలబస్ తగ్గించాలని నిర్ణయించినట్టు, ఆ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)కు సూచించినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియ కోసం విలువైన సూచనలివ్వాలని విద్యావేత్తలను కోరగా, సుమారు 1500 సలహాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News