రీఫండ్‌ల కోసం ఎలాంటి పత్రాలు అడగొద్దు : సీబీఐసీ!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ఒక లక్ష వ్యాపార సంస్థలకు ఊరట ఇచ్చేలా జీఎస్టీ, కస్టమ్స్ రీఫండ్లను చెల్లించాలంటూ ఆర్థిక శాఖ వారం క్రితం నిర్ణయించింది. ఇందులో భాగంగా జీఎస్టీ, రీఫండ్ క్లెయిమ్స్ కోసం సంస్థలు పత్రాలను సమర్పించేలా ఒత్తిడి చేయకూడదని కింది స్థాయి అధికారులను పరోక్ష పన్నుల, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్(సీబీఐసీ) కోరింది. ఈ నెల ‘స్పెషల్ రీఫండ్ అండ్ డ్రాబ్యాక్ డిస్పోజల్ డ్రవ్’ పేరుతో రూ. 18,000 కోట్ల విలువైన రీఫండ్లు చెల్లించేందుకు సీబీఐసీ […]

Update: 2020-04-14 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ఒక లక్ష వ్యాపార సంస్థలకు ఊరట ఇచ్చేలా జీఎస్టీ, కస్టమ్స్ రీఫండ్లను చెల్లించాలంటూ ఆర్థిక శాఖ వారం క్రితం నిర్ణయించింది. ఇందులో భాగంగా జీఎస్టీ, రీఫండ్ క్లెయిమ్స్ కోసం సంస్థలు పత్రాలను సమర్పించేలా ఒత్తిడి చేయకూడదని కింది స్థాయి అధికారులను పరోక్ష పన్నుల, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్(సీబీఐసీ) కోరింది. ఈ నెల ‘స్పెషల్ రీఫండ్ అండ్ డ్రాబ్యాక్ డిస్పోజల్ డ్రవ్’ పేరుతో రూ. 18,000 కోట్ల విలువైన రీఫండ్లు చెల్లించేందుకు సీబీఐసీ మొదలుపెట్టింది. అంతేకాకుండా అధికారికంగా ఈ-మెయిల్‌ల ద్వారానే సమాచారం పంపించాలని ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్లకు సీబీఐసీ స్పష్టం చేసింది. మాములు ప్రక్రియలో భాగంగా ఎటువంటి పత్రాలను సమర్పించాల్సి అవసరంలేదని ఇటీవల ప్రిన్సిపల్ కమీషనర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొంది.

Tags: Covid, Central Board, CBIC, Taxpayers Finance Ministry, Customs, Refunds

Tags:    

Similar News