సీఎం జగన్‌కు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ….

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌కు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ రాశారు. తిరుపతి ఎస్పీ రమేశ్ రెడ్డిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. గాజుల మంధ్యంలో జరిగిన యువతి అత్యాచార ఘటనలో ఫాస్టర్ దైవ సహాయాన్ని తప్పించేందకు ఎస్పీ యత్నించారని ఆయన అన్నారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే తనను అగౌర పరిచేలా ఎస్పీ మాట్లాడారని ఆయన చెప్పారు. ఈ కేసులో ఎస్పీ పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. […]

Update: 2020-10-16 11:46 GMT

దిశ, వెబ్ డెస్క్:
సీఎం జగన్‌కు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ రాశారు. తిరుపతి ఎస్పీ రమేశ్ రెడ్డిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. గాజుల మంధ్యంలో జరిగిన యువతి అత్యాచార ఘటనలో ఫాస్టర్ దైవ సహాయాన్ని తప్పించేందకు ఎస్పీ యత్నించారని ఆయన అన్నారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే తనను అగౌర పరిచేలా ఎస్పీ మాట్లాడారని ఆయన చెప్పారు. ఈ కేసులో ఎస్పీ పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితులను కాపాడేందుకు 9రోజుల పాటు ఆలస్యం చేయడంతో కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా పోయిందనీ ఆయన తెలిపారు. ఎస్పీగా రమేశ్ రెడ్డి ఉంటే బాధితురాలికి న్యాయం జరగదని ఆయన అన్నారు. రమేశ్ రెడ్డి లాంటి వాళ్లు ముఖ్యమైన స్థానాల్లో ఉంటే సీఎం జగన్ కు కొత్త శత్రువులు అవసరం లేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News