కాంగ్రెస్ సీనియర్ నేతపై కేసు నమోదు

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. ఓ వీడియో విషయమై ఆయనపై సోమవారం భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు సంబంధించిన ఓ వీడియోను దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఆ వీడియో తప్పుడు వీడియో అని.. అది శివరాజ్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భోపాల్ […]

Update: 2020-06-15 00:46 GMT

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. ఓ వీడియో విషయమై ఆయనపై సోమవారం భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు సంబంధించిన ఓ వీడియోను దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఆ వీడియో తప్పుడు వీడియో అని.. అది శివరాజ్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News