బెంగళూరు అల్లర్లలో 17మందిపై కేసు..
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో బుధవారం సాయంత్రం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీప బంధువు ఒకరు ఫేస్బుక్‌లో ఒక మతానికి చెందిన వారి మనోభావాలు కించపరిచేలా పోస్టు పెట్టారంటూ కొందరు అల్లరిమూకలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగాయి. పెట్రోల్ బాంబులు విసిరాయి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చాయి. అల్లరి మూకలను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కాగా, […]
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో బుధవారం సాయంత్రం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీప బంధువు ఒకరు ఫేస్బుక్‌లో ఒక మతానికి చెందిన వారి మనోభావాలు కించపరిచేలా పోస్టు పెట్టారంటూ కొందరు అల్లరిమూకలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగాయి. పెట్రోల్ బాంబులు విసిరాయి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చాయి.
అల్లరి మూకలను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కాగా, గురువారం 17మంది ప్రధాన నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.డీజే హళ్లి, కేజీ హళ్లి, పీఎస్ ల పరిధిలో ఎల్లుండి వరకు ఉదయం 6గంటల వరకు 144సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.