మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను దూషించిన NRI పై కేసు

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితర తెలంగాణ నేతలపై అసభ్య పదజాలంతో దూషించిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్‌పై మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ జలాల దోపిడీ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్‌ను దొంగ, గజదొంగ అని సంబోధించిన నేపథ్యంలో పంచ్ ప్రభాకర్ పేరుతో ఓ ఎన్ఆర్ఐ మంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ […]

Update: 2021-06-28 10:50 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితర తెలంగాణ నేతలపై అసభ్య పదజాలంతో దూషించిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్‌పై మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ జలాల దోపిడీ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్‌ను దొంగ, గజదొంగ అని సంబోధించిన నేపథ్యంలో పంచ్ ప్రభాకర్ పేరుతో ఓ ఎన్ఆర్ఐ మంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు తదితరులు పాలమూరు పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News