TS TET 2024: టెట్ హాల్‌టికెట్ల కీలక అప్‌డేట్

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షా హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. నేటి నుంచి టెట్ వైబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

Update: 2024-05-16 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షా హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. నేటి నుంచి టెట్ వైబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు ఈ https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు విడతల వారీగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్దతిలో టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తు చేశారు. టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

Read More...

తెలంగాణ టెట్‌ హాల్ టికెట్లు విడుదల 

Tags:    

Similar News