గ్రూప్స్ స్పెషల్ ఫోకస్; మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది.

మంత్రిమండలి సభ్యులను ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. Important bits about the cabinet

Update: 2022-03-20 07:30 GMT

*మంత్రిమండలి సభ్యులను ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. 

*కేంద్రమంత్రి మండలిలో మూడు రకాల సభ్యులుంటారు. 

*రాజ్యాంగంలో కేబినేట్ అనే పదం 1978లో చేర్చారు.   

*91వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రుల సంఖ్య 82కు మించరాదు.

*మంత్రి మండలి లోక్ సభకు బాధ్యత వహిస్తుంది. 

*రాష్ట్ర మంత్రి మండలి జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. 

*భారత్ లో కొనసాగుతున్న పార్లమెంటరీ ప్రభుత్వ విధానం- బ్రిటన్ విధానం

*స్వాతంత్య్రానంతరం తొలి హోంశాఖ మంత్రి - సర్దార్ వల్లభాయ్ పటేల్

*కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ నిజమైన అధికారం మంత్రి మండలి చేతిలో ఉంటుంది. 

*అత్యధిక కాలం కేంద్రమంత్రి పదవిని నిర్వహించినది- జగ్జీవన్ రాం

*కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసిన తొలి మంత్రి- శ్యాం ప్రసాద్ ముఖర్జీ

*రాష్ట్రంలో మంత్రి మండలి సమావేశం ముఖ్య మంత్రి అధ్యక్షతన జరుగుతుంది.

*పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహకులు శాసనసభకు బాధ్యులు

*రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రుల స్థాయి ముఖ్యమంత్రితో సంప్రదించి గవర్నర్ కేటాయిస్తారు. 

*కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధాని నిర్ణయిస్తారు. 

*కేంద్ర మంత్రి అయిన మొట్టమొదటి మహిళ- రాజ్ కుమారి అమృత్ కౌర్

*ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్టినెన్స్ జారీ చేస్తారు. 


Tags:    

Similar News