AIBE XVIII ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) 18వ పరీక్ష తుది సమాధాన కీ విడుదలయ్యింది.

Update: 2024-03-21 13:04 GMT

దిశ, ఫీచర్స్ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) 18వ పరీక్ష తుది సమాధాన కీ విడుదలయ్యింది. అభ్యర్థులు AIBE allindiabarexanation.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాత్కాలిక ఆన్సర్ కీ పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది సమాధాన కీని విడుదల చేశారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా AIBE 18 ఉత్తీర్ణత మార్కులను సవరించింది. జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 45 శాతం మార్కులు పొందాలి. ఇంతకుముందు కటాఫ్‌ను 40 శాతంగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అంతకు ముందు ఇది 35 శాతంగా ఉంది. రిజల్ట్ కూడా త్వరలో వెల్లడికానున్నాయి.

AIBE XVIII ఫైనల్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా..

BCI atallindiabarexanation.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో AIBE XVIII ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌ పై క్లిక్ చేయండి.

జవాబు కీ PDF రూపంలో స్క్రీన్‌ పై కనిపిస్తుంది.

తనిఖీ చేసి ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

AIBE XVIII పరీక్ష 10 డిసెంబర్ 2023న నిర్వహించారు. డిసెంబర్ 3న అడ్మిట్ కార్డులు జారీ చేశారు. ఓఎంఆర్‌ షీట్‌లో పరీక్ష నిర్వహించారు. ప్రొవిజినల్ ఆన్సర్ కీ 12 డిసెంబర్ 2023 న విడుదల చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు దాని పై అభ్యంతరాలు తెలియజేయడానికి 20 డిసెంబర్ 2023 వరకు సమయం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 16 ఆగస్టు 2023న ప్రారంభమై 19 నవంబర్ 2023 వరకు కొనసాగింది.

Tags:    

Similar News