తెలుగు వర్సిటీ దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి గాను దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పలు కోర్సులకు ప్రవేశ ప్రకటనను విడుదల చేస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బిహెచ్. పద్మప్రియ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Update: 2022-12-27 14:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి గాను దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పలు కోర్సులకు ప్రవేశ ప్రకటనను విడుదల చేస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బిహెచ్. పద్మప్రియ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది విశ్వవిద్యాలయం నిర్వహించే పలు కోర్సులకు సంబంధించి పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందగోరే ఆసక్తిగల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. దరఖాస్తులను ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సంబంధిత రుసుముతో స్వీకరించబడుతుందని, అదనంగా ఆలస్య రుసుము 200 రూపాయలతో మార్చి 31 వరకు దరఖాస్తులను పొందవచ్చని డైరెక్టర్, దూరవిద్యా కేంద్రం వారు తెలిపారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.teluguuniversity.ac.in ను, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం pstu.softelsolutions.inను చూడవచ్చని తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News