సమయం లేదు.. 475 ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి

దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్‌డీసీ తీపికబురు అందించింది. చాలా రోజుల నుంచి మంచి జాబ్ కావాలని ఎదురు చూస్తున్న

Update: 2022-07-07 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్‌డీసీ తీపికబురు అందించింది. చాలా రోజుల నుంచి మంచి జాబ్ కావాలని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సంస్థవారు మెగా జాబ్ మేళాను నిర్వహించినున్నారు. AUROBINDO PHARMA కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. Department QC, Production, Packing, Maintenance విభాగంలో మొత్తం 475 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

అర్హతలు :

ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు ఈ జాబ్స్‌కి అర్హులు.

ముఖ్యమైన సమాచారం :

ఈ జాబ్ కోసం ఈ నెల 11 న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Similar News