సామాన్యులకు షాకింగ్ న్యూస్.. రూ.2లక్షలకు చేరనున్న తులం బంగారం ధర?

రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పటి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం పేరు చెప్పగానే సామాన్యులు వెనకడుకు వేస్తున్నారు. వారికి అందని ద్రాక్షల బంగారం మిగిలిపోతుంది.

Update: 2024-05-23 08:42 GMT

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పటి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం పేరు చెప్పగానే సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. వారికి అందని ద్రాక్షల బంగారం మిగిలిపోతుంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక పెళ్లి అయితే చాలు తులాలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే అలాంటి బంగారం ధరలు రోజు రోజుకు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగించే విషయంగానే చెప్పవచ్చు. ఇక దీని డిమాండ్ పెరగడం వలన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో తొమ్మిది ఏళ్లలో బంగారం ధర రెండు లక్షలకు చేరువ కానుంది అంటున్నారు ఎనలిస్టులు.

10 గ్రాముల బంగారం ధర మరో తొమ్మిది సంవత్సరాలలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్నదంట. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతీ తొమ్మిదేళ్లకు 3 రేట్లు పెరుగుతోందని, ప్రస్తుతం రూ.70 వేలకు పైగా ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేట్, 2033 వరకు రూ.2.1లక్షలకు చేరొచ్చునని అంచనా వేశారు. 2015లో దీని ధర రూ.24,740 ఉండగా,2023లో 3 రేట్లు పెరిగిందని, అంతకు ముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగినట్లు తేలిందని వారు పేర్కొన్నారు. ఇక ఈ బంగారం పెరుగుదల అనేది సామాన్యులకు పెను భారంగా మారబోతుంది అంటున్నారు నెటిజన్స్.

Similar News