AI స్కిల్స్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చిన TCS

దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది

Update: 2024-03-29 11:56 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులకు AI నైపుణ్యాలను నేర్పించాలని గతంలోనే కంపెనీ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనవరిలో దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు సంస్థ ప్రకటించగా, తాజాగా 3.5 లక్షల మందికి AI స్కిల్స్‌ను నేర్పించినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత మంది ఉద్యోగులకు GenAIలో శిక్షణ ఇవ్వడం ద్వారా క్లౌడ్‌తో పాటు ఇతర సేవల్లో ఈ కొత్త సాంకేతికతను విరివిగా వాడే అవకాశం ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

పెరుగుతున్న అవసరాలు, కస్టమర్ల సమస్యలు పరిష్కరించడానికి AI బాగా ఉపయోగపడుతుంది. టీసీఎస్ ఇప్పటి వరకు విమానయాన సంస్థలకు సేవల అందించడానికి GenAI అప్లికేషన్‌ని కలిగి ఉంది. దీంతో ఫ్లైట్ ఆలస్యం అయినప్పుడు లేదా రద్దు చేయబడినప్పుడు కస్టమర్‌లతో మాట్లాడటం, సలహాలు, సూచనలు వంటి పలు రకాల సేవలు అందిస్తుంది. శుక్రవారం, టాటా గ్రూప్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) జెనరేటివ్ AI కాంపిటెన్సీ పార్టనర్ హోదాను మంజూరు చేసినట్లు ప్రకటించింది.

Similar News