అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్న్నట్టు ప్రకటించింది.

Update: 2023-04-14 08:34 GMT

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్న్నట్టు ప్రకటించింది. నియంత్రణ మార్పులు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. పెంచిన ధరలు మే 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాహన వేరియంట్, మోడల్ ఆధారంగా సగటున పెరుగుదల 0.6 శాతం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫిబ్రవరి తర్వాత ప్యాసింజర్ వాహనాలపై కంపెనీ ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఉద్గార నిబంధనలు, వాహన తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు భారాన్ని సాధ్యమైనంత వరకు కంపెనీ భరిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, కంపెనీ ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో వాహనాల ధరలను సగటున 1.2 శాతం పెంచింది. ఇక, మారిన ఉద్గార నిబంధనలు, ఇతర ఖర్చుల కారణంగా టాటాతో పాటు మారుతీ సుజుకి, హ్యూండాయ్, హోండా కంపెనీలు సైతం తమ కార్ల ధరలను మోడల్‌ను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 15 వేల మధ్య పెంచిన సంగతి తెలిసిందే.

Also Read..

తొమ్మిది నెలల గరిష్ఠానికి భారత ఫారెక్స్ నిల్వలు! 

Tags:    

Similar News