అదానీ సోదరుడు వినోద్ అదానీ సంస్థల లావాదేవీలపై సెబీ దర్యాప్తు

అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ సంబంధం కలిగి ఉన్నటువంటి మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో అదానీ గ్రూప్ లావాదేవీల నిబంధనల ఉల్లంఘనపై రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Update: 2023-04-01 06:57 GMT

ముంబై: అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ సంబంధం కలిగి ఉన్నటువంటి మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో అదానీ గ్రూప్ లావాదేవీల నిబంధనల ఉల్లంఘనపై రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గౌతమ్ అదానీ కి చెందిన పోర్ట్స్, పవర్ కంపెనీలలో ఈ మూడు సంస్థలు అనేక పెట్టుబడి సంబంధిత లావాదేవీలు జరిపాయని ప్రధాన అభియోగం. ఆ మూడు కంపెనీలు మారిషస్‌కు చెందిన క్రునాల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, గార్డెనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, దుబాయ్‌లోని ఎలక్ట్రోజెన్ ఇన్‌ఫ్రా. ఈ విషయంపై అదానీ గ్రూప్ అధికారి ఒకరు మాట్లాడుతూ, వినోద్ అదానీ, అదానీ కుటుంబంలో సభ్యుడు, ప్రమోటర్ గ్రూప్‌లో భాగమని, అయితే లిస్టెడ్ అదానీ కంపెనీలు లేదా వాటి అనుబంధ సంస్థలలో అతను ఎటువంటి నిర్వాహక పదవిని కలిగి లేడని తెలిపారు.

Also Read..

వరుసగా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్న జియో, ఎయిర్‌టెల్! 

Tags:    

Similar News