రూ.2 వేల నోట్లు మార్చుకునేవారికి SBI శుభవార్త

ఇండియన్ గవర్నమెంట్ రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-05-21 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ గవర్నమెంట్ రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మే 23వ తేదీ నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అయితే.. రూ. 2 వేల నోట్లను RBI ఉపసంహరించుకున్న నేపథ్యంలో నోట్ల మార్పిడిపై SBI కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలెవరూ ఐటెండిటీ ప్రూఫ్ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే రిక్వెస్ట్ లెటర్ లేదా ఫాం నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక విడతలో గరిష్టంగా రూ. 20వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.



 


Tags:    

Similar News