ర్యాన్సమ్‌వేర్ దాడితో ఆదాయం తగ్గుతుందన్న సన్‌ఫార్మా!

ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా ర్యాన్సమ్‌వేర్ దాడికి గురైనట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2023-03-27 17:14 GMT

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా ర్యాన్సమ్‌వేర్ దాడికి గురైనట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దానివల్ల కంపెనీ డేటా, వ్యక్తిగత సమాచారంపై ప్రభావం పడటంతో ఆదాయం ప్రభావితమవుతుందని వెల్లడించింది. ఈ నెల మొదటివారంలో సన్‌ఫార్మా ఐటీ విభాగంపై హ్యాకర్లు దాడి చేయగా, ఆ సమయంలో కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురుకాలేదు. వెంటనే సంస్థ ఐటీ భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుందని, నెట్‌వర్క్ ఐసొలెట్ చేసి, రికవరీ ప్రక్రియను మొదలుపెట్టినట్టు సంస్థ వివరించింది.

ర్యాన్‌సమ్‌వేర్ వల్ల కొంత వ్యాపార కార్యకలాపాలు ప్రభావితం కావడంతో ఆదాయం దెబ్బతినే అవకాశం ఉందని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఇచ్చిన ఫలింగ్‌లో తెలిపింది. ఇటీవలే ర్యాన్సమ్‌వేర్ ప్రభావాన్ని అంచనా వేశామని, బీమా కవరేజీకి అయ్యే ఖర్చులు, ఇతర ప్రభావాలను గుర్తించలేనప్పటికీ ఈ సంఘటనలకు సంబంధించి ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

Tags:    

Similar News