Godrej: 127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన ప్రముఖ సంస్థ.. కారణం ఇదే..

భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో గోద్రేజ్ కంపెనీ కూడ ఒకటి. తాళాల తయారితో మొదలై, నేడు పలు రంగాల్లో దూసుకుపోతున్న కంపెనీ గోద్రేజ్.

Update: 2024-05-01 08:52 GMT

దిశ వెబ్ డెస్క్: భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో గోద్రేజ్ కంపెనీ కూడ ఒకటి. తాళాల తయారితో మొదలై, నేడు పలు రంగాల్లో దూసుకుపోతున్న కంపెనీ గోద్రేజ్. దాదాపు 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ రెండుగా విడిపోయిందని తెలుస్తోంది. వివారాల్లోకి వెళ్తే.. వ్యక్తిగత విభేదాల కారణంగా గోద్రేజ్ కుటుంబ వారసులు గోద్రేజ్ గ్రూప్‌ను రెండుగా విభజించారని సమాచారం.

అలానే వాటాల పంపకం కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, కుదిరిందన ఒప్పందం ప్రకారం.. గోద్రేజ్ ఇండస్ట్రీస్‌కి సంబందించిన 5 లిస్టెడ్ కంపెనీలను ఆది గోద్రేజ్, నదిర్‌ల వాటా కింద దక్కించుకున్నారు. ఇక అన్ లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు జెంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు దక్కాయి.

కాగా వారికి వీటితో పాటుగా ముంబైలోని 3,400 ఎకరాల భూమి కూడా చెందనుందని సమాచారం. అలానే ఈ పంపకాల్లో గోద్రెజ్ బ్రాండ్‌ను రెండు గ్రూపులు ఉపయోగించుకునేలా అంగీకారం కుదిరింది. కాగా వాటాల కార్యక్రమం పూర్తైన నేపథ్యంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గా ఆది గోద్రేజ్ కుమార్తె పిరోజ్ షా గోద్రెజ్ వ్యవహరించనున్నారని, 2026 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ఇక గోద్రెజ్ & బోయ్స్ గ్రూప్‌‌కు సీఎండీగా జంషెడ్ గోద్రెజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యారికా హోల్కర్ నేతృత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. 


Similar News