OnePlus నుంచి ప్రత్యేకంగా భారీ తగ్గింపులతో ఫెస్టివల్ సేల్

పండగల సీజన్ సందర్భంగా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున భారీ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో వినియోగారులకు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయి..Latest Telugu News

Update: 2022-09-22 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: పండగల సీజన్ సందర్భంగా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున భారీ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో వినియోగదారులకు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీటితో పాటు పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సైతం వాటి ఉత్పత్తులను భారీ తగ్గింపులతో అందిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ OnePlus కూడా చేరింది. రాబోయే దీపావళిని పురస్కరించుకుని 'దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022' ను తీసుకొచ్చింది.


ఈ సేల్‌లో Axis బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఆఫర్ సంబంధించిన సేల్ సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.


దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022లో స్మార్ట్‌ఫోన్‌లు, TWS ఇయర్‌బడ్‌లు, టీవీలతో పాటు వివిధ రకాల వన్‌పస్ల్ ప్రొడక్ట్స్ తక్కువ ధరకు లభించనున్నాయి. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో OnePlus TV Y1 సిరీస్ ధర రూ.18,999కి బదులుగా రూ.14,999 కు లభిస్తుంది. OnePlus వన్‌ప్లస్ 10 ప్రో ధర రూ. 66,999 నుండి రూ. 55,999కి లభిస్తుందని కంపెనీ పేర్కొంది.


OnePlus 10R 5G ధర రూ. 34,999 ఉండగా సేల్ టైం లో రూ. 29,999కు, OnePlus Nord 2T 5G ధర రూ. 28,999కి బదులుగా రూ. 26,999కు, OnePlus బడ్స్ ప్రో ధర రూ. 6,490కు లభిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది.

Similar News