Ola సరికొత్త ప్రోగ్రామ్.. 4,500 వరకు క్యాష్‌బ్యాక్‌ మీదే!

రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా ఇటీవల కాలంలో వరుసగా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది.

Update: 2022-12-06 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా ఇటీవల కాలంలో వరుసగా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు తన అమ్మకాలను పెంచుకోడానికి కంపెనీ ఒక ఆఫర్‌ను తెచ్చింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల కోసం రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. రిఫరల్ ప్రోగ్రామ్‌ ద్వారా వినియోగదారులు రూ. 4,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ విషయాన్ని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Ola స్కూటర్ల కొనుగోలుకు ఇతరులను రిఫర్ చేయడం ద్వారా ఈ మొత్తం గెలుచుకోవచ్చు.


దీని కోసం వినియోగదారులు ముందుగా వెబ్‌సైట్‌'(https://olaelectric.com/referrals)'లో 'రిఫరల్ ప్రోగ్రామ్‌' ను ఎంచుకోవాలి. తరువాత మొబైల్ నంబర్‌ని నమోదు చేసి, OTP ద్వారా లాగిన్ కావాలి. అందులో మీరు ఎవరిని రిఫర్ చేయాలనుకుంటున్నారో వారి వివరాలు నమోదు చేయాలి. మొత్తంగా ముగ్గురిని రిఫర్ చేయవచ్చు. వారు స్కూటర్లను కొనుగోలు చేసినట్లయితే సిఫార్సు చేసినందుకు రూ. 1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఇలా మొత్తం ముగ్గురిని రిఫర్ చేయడం ద్వారా రూ. 4,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు

Similar News