లోక్‌సభ ఎన్నికల తర్వాత అమల్లోకి కొత్త టెలికాం నిబంధనలు

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా దీన్ని తీసుకొచ్చేందుకు డీఓటీ ప్రయత్నిస్తోంది.

Update: 2024-05-22 15:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 ప్రకారం కొత్త నిబంధనలను అమలు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) భావిస్తోంది. దీనికి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గతంలోనే సిఫార్సు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా దీన్ని తీసుకొచ్చేందుకు డీఓటీ ప్రయత్నిస్తోంది. టెలికామ్యూనికేషన్ చట్టంలోని నిబంధనలను సెప్టెంబర్ 15 నాటికి అమల్లో తెచ్చే యోచనలో ఉన్నట్టు డీఓటీ పేర్కొంది. నకిలీ సిమ్ కార్డులు, సిబర్ మోసాలను కట్టడి చేసేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి. కొత్త నిబంధనల ప్రకార్మ, కొత్తంగా సిమ్ కార్డు కనెక్షన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ గుర్తింపును తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే, ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే సమయంలో పొరపాట్లు జరగకుండా టెలికాం కంపెనీలకు డీఓటీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైన్ కమ్యూనికేషన్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాలి. టెలికాం రంగంలో నియమ, నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023లో కొత్త చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News