మే-27: నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం ధరలు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళన చెందేలా చేస్తున్నాయి.

Update: 2024-05-27 05:53 GMT

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళన చెందేలా చేస్తున్నాయి. ఈ మధ్య పెళ్లిళ్లు లేనందున ధరలు తగ్గుతాయని భావించని కొనుగోలు దారులకు బంగారం రేట్లు పెరుగుతూ.. షాకిస్తున్నాయి. దీంతో చాలా మంది బంగారం కొనడానికి సంకోచిస్తున్నారు.

రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా, నేడు బంగారం రేట్లు పెరిగాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 పెరగ్గా రూ. 66, 650కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగడంతో రూ. 72, 710గా ఉంది. కిలో వెండిపై రూ. 1500 పెరగ్గా.. రూ. 97,500గా విక్రయిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 650

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,710

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 650

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,710

Similar News