ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లను తొలగించేలా నిబంధనలు!

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లను తొలగించడంతో పాటు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను, నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది

Update: 2023-03-14 14:08 GMT

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లను తొలగించడంతో పాటు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను, నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లలో పెరిగిన వ్యక్తిగత వివరాల చౌర్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం కఠినమైన చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను తీసుకురానున్నట్లు ప్రభుత్వాధికారులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్టు సమాచారం. దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ నిబంధనలను పరిశీలిస్తోంది. ముందుగానే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల వల్ల భద్రతాపరమైన ముప్పు ఉంటుందని, చైనాతో పాటు ఇతర దేశాలు ఇలాంటి లోపాల ద్వారా దేశ భద్రతకు భంగం కలిగించవచ్చని, అలాంటి సంఘటనలను నివారించడమే ప్రభుత్వం లక్ష్యమని ఓ అధికారి చెప్పారు.

ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిబంధనలు తీసుకొస్తే ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌ల ద్వారా ప్రయోజనాలు పొందుతున్న శాంసంగ్, యాపిల్, రెండ్‌మీ, షావోమీ లాంటి కంపెనీల వ్యాపారం దెబ్బతింటాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News