ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే సత్తా భారత్‌కు ఉంది: రఘురామ్ రాజన్

భారత్ తన అంతర్గత బలాలను ఉపయోగించుకోవడం, చారిత్రక సంస్కృతిని నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.

Update: 2023-05-13 04:12 GMT

లండన్: భారత్ తన అంతర్గత బలాలను ఉపయోగించుకోవడం, చారిత్రక సంస్కృతిని నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అలాగే, సేవల పరిశ్రమలో భారతదేశానికి నాయకత్వ పాత్ర పోషించే అవకాశం ఉంది, దీనికోసం ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదించడానికి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజన్ పేర్కొన్నారు.

చైనా లేదా ఇతర పొరుగు దేశాలతో పోటీ పడాలంటే తయారీ లేదా సేవలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ అన్నారు. సాంకేతిక రంగంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. చిప్‌ల తయారీ కేంద్రంగా ఎదగడానికి ఉన్న అవకాశాలను అన్నింటిని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. ఏడాదిలో 10,000 మంది అత్యుత్తమ సాంకేతిక ఇంజనీర్లను తయారు చేస్తే, చిప్ డిజైన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదగగలమని ఆయన అన్నారు. ప్రధానంగా భారత్‌కు ఉన్న ఉదారవాద ప్రజాస్వామ్యం కలిసివచ్చే అంశం. దీని ద్వారా ప్రపంచ నమ్మకాన్ని పొందగలుగుతాము అని ఆయన తెలిపారు.

Also Read...

మే-13: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా? 

Tags:    

Similar News