త్వరపడండి రూ.10కే కిలో చేపలు.. ఎక్కడో తెలుసా

సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

Update: 2024-05-26 08:49 GMT

దిశ, ఫీచర్స్ : సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తెల్లవారుజాము నుంచే ఆయా సెంటర్ల ముందు బారులు తీరుతారు. కాస్త ధర తగ్గిందంటే చాలు ఇంకాస్త ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ ను తీసుకుంటారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపలు కొనేందుకు జనాలు తండోపతండాలుగా ఎగబడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో కిలో చేపలను రూ. 10, 20 కే విక్రయిస్తున్నారు. అసలే ఆదివారం అందులో చాక్లెట్ ధరకే అంతే అతి తక్కువ ధరకే చేపలు అమ్మకానికి ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు ఎగబడి కొంటున్నారు. కొనుగోలు దారులు అతి తక్కువ ధరకే మంచి పౌష్టికాహారం లభించడంతో సంతోషంలో మునుగుతుంటే రైతులు మాత్రం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో గత 2 రోజులుగా మార్పులు సంభవించడంతో చేపలు భారీగా మృత్యువాత పడుతున్నాయంటున్నారు. అందుకే చేసేదేమీ లేక అతితక్కువ ధరకే చేపలను అమ్ముతున్నట్లు రైతులు వెల్లడిస్తున్నారు.

Similar News