భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది: ఐఎంఎఫ్

ప్రస్తుతం భారత స్థూల ఆర్థిక వాతావరణం మెరుగ్గా ఉందని, అయితే మరిన్ని వ్యాపార అవకాశాలను అందించడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్‌ ఒక ప్రకటనలో అన్నారు

Update: 2023-10-14 10:52 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత స్థూల ఆర్థిక వాతావరణం మెరుగ్గా ఉందని, అయితే మరిన్ని వ్యాపార అవకాశాలను అందించడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్‌ ఒక ప్రకటనలో అన్నారు. డిజిటలైజేషన్, సదుపాయాలను మెరుగుపరచడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. శ్రామిక సంస్కరణల ద్వారా పెట్టుబడిదారులకు మరింత సపోర్ట్ అందించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ధరల పెరుగుదలతో అస్థిర పరిస్థితులను ఎదర్కొంటున్నప్పటికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి క్రమశిక్షణతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వేగంగా చర్యలు తీసుకుందని ఆయన ప్రశంసించారు. వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాసన్ అన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు దాని ప్రభావం భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో కూడా ఉంటుందని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఐఎంఎఫ్ భారత్ వృద్ధి అంచనాలను 20 బేసిస్ పాయింట్లతో 6.3 శాతానికి పెంచింది.

Tags:    

Similar News