వినియోగ దారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

Update: 2024-05-01 03:26 GMT

దిశ, ఫీచర్స్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే నేడు మే1 తేదీన కావడంతో చమురు సంస్థలు వినియోగ దారులకు గుడ్ న్యూస్ ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలపై రూ.19 తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని తెలపడంతో వినియోగదారులు సంతోషపడుతున్నారు.

అయితే నేడు ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1764.50 నుంచి 1745.50కి తగ్గింది. అలాగే ముంబైలో రూ. 17,17.50 ఉండగా.. రూ. 1698.50కి దిగొచ్చింది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో.. ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్  సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944


Similar News