అదిరిపోయే ఫీచర్స్‌తో Hop OXO ఈవీబైక్.. పెట్రోలు ఖర్చు అంతతో ఈఎమ్ఐ కట్టొచ్చు!

ప్రముఖ Hop కంపెనీ OXO ప్రైమ్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.

Update: 2023-07-02 16:46 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ Hop కంపెనీ OXO ప్రైమ్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇప్పటివరకు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటీల విభాగంలో ఉత్పత్తులు విక్రయించింది. ఇటీవల బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చాలా రోజుల తర్వాత తిరిగి ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకూ రివోల్ట్ మాత్రమే ఈ బైక్‌లలో అతి ఎక్కువ సేల్స్ కలిగి ఉంది. ఇప్పుడు తాజాగా Hop కంపెనీ తన బైక్ మోడల్స్ ను మార్కెట్లో అందుబాటులో ఉంచింది.

Hop OXO ప్రైమ్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1,48,073గా కంపెనీ నిర్ణయించింది. దీని ఈఎమ్ఐ రూ. 4,888 నుంచి ప్రారంభం అవుతుంది! అయితే ఈ బైక్ టాప్ స్పీడ్ ప్రైమ్ మోడల్ 82 కి.మీ/H  ఉంటుంది. ఇతర మోడళ్లలో దీని స్పీడ్ 95కెంఎంపీహెచ్ వరకూ ఉంది. దీని రియల్ రేంజ్ వచ్చేసి ఎకో మోడ్‌లో 120 కి.మీ వరకూ వస్తుంది. ఇతర మోడళ్లలో 140 నుంచి 150 కి.మీ వరకూ ఉంది.

దీనిలో 4.2 కి.వాట్ నుంచి మొదలై 5.2/6.2 కి.వాట్ వరకూ బ్యాటరీ అందుబాటులో ఉన్నాయి. 72 వోల్టోజ్ ఉంటుంది. ఇక మ్యాక్జిమమ్ టార్క్ వచ్చేసి 160ఎన్ఎం ఉంటుంది. ఇతర మోడళ్లలో 175, 200 ఎన్ఎం అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఎల్డీసీ హబ్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు దగ్గరలోని HOP కంపెనీ డీలర్లను సంప్రదించి తెలుసుకోవచ్చు.

Read More:   మీది ఎలక్ట్రికల్ కారు అయితే... వర్షకాలంలో తస్మాత్ జాగ్రత్త 

Tags:    

Similar News